Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Kedarnath: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి వారు అక్కడే ఉండిపోయారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా 18 మంది వెళ్లారు. కేదార్‌నాథ్‌ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్‌కు బయల్దేరారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండు రోజులుగా నిజామాబాద్‌, విజయనగరం యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్‌ సర్వీసులను నిలిపేశారు.

Kedarnath – యాత్రికులతో మాట్లాడిన ఎంపీ కలిశెట్టి

మరోవైపు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో మాట్లాడామని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పారు.

Also Read : Balineni Srinivasa Reddy: జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు !

Leave A Reply

Your Email Id will not be published!