Pithapuram Ex MLA: పవన్ కళ్యాణ్ కు పిఠాపురం లైన్ క్లియర్ !
పవన్ కళ్యాణ్ కు పిఠాపురం లైన్ క్లియర్ !
Pithapuram Ex MLA: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జ్ వర్మ మొత్త బడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో శనివారం భేటీ అయిన తరువాత… ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసే విషయంలో వెనక్కి తగ్గారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు సహరిస్తానని అన్నారు. చంద్రబాబు వద్ద నుండి తన రాజకీయ భవిష్యత్తుకు అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి హామీ లభించిందని… పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించి… నియోజక వర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.
Pithapuram Ex MLA Accepted…
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… తాను పిఠాపురం నుండి పోటీచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనితో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తు ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా పార్టీకు సేవ చేస్తున్న వర్మను కాదని పవన్ కళ్యాణ్ కు సీటు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ, జనసేన జెండాలను, ఫ్లెక్సీలను తగలబెట్టారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను పరుష పదజాలంతో దూషించారు. దీనితో చంద్రబాబు… శనివారం మాజీ ఎమ్మెల్యే వర్మను విజయవాడకు పిలిపించి బుజ్జగించారు.
టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
వైసీపీ సీనియర్ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి టీడీపీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు వారికి కండువాకప్పి టీడీపీలోనికి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణచైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
Also Read : MLC Kavitha: వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత !