Pithapuram: వేడెక్కిన పిఠాపురం రాజకీయాలు ! పవన్ వ్యాఖ్యలే కారణమా ?

వేడెక్కిన పిఠాపురం రాజకీయాలు ! పవన్ వ్యాఖ్యలే కారణమా ?

Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తోంది. మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో… పిఠాపురం టీడీపీ ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దత్తుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు… వర్మను పిలిపించి బుజ్జగించడంతో… పవన్ కళ్యాణ్ గెలుపుకు సహరిస్తానని వెల్లడించారు. అయితే ఇది జరిగి 24 గంటలు తిరగక ముందే జనసేనాని మరో సంచలన ప్రకటన చేసారు.

‘‘కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన యువనేత, టీ టైం అధినేత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అమిత్ షా, మోదీలు తనను పార్లమెంట్ కు పోటీ చేయమని ఆదేశిస్తే… ఉదయ్ పిఠాపురం(Pithapuram) అసెంబ్లీకు, తాను కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేస్తామని తెలిపారు. దీనితో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. దీనితో పవన్ వ్యాఖ్యలపై మరోసారి టీడీపీ ఇన్ చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. ‘‘సుమారు 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా. అధినేత చంద్రబాబుకు ఆదేశాలతో పవన్‌ కోసం నా సీటును త్యాగం చేశా. ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నా. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే రక్తం ధారపోసి అయినా ఆయన్ని గెలిపిస్తానని స్పష్టం చేసారు. కాని పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ కు వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం బరిలో తానే ఉంటానని స్పష్టం చేసారు. దీనితో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి పిఠాపురం రాజకీయాలను వేడెక్కించాయి.

Pithapuram – వైసీపీలో చేరిన పిఠాపురం జనసేన నాయకురాలు మాకినీడి శేషకుమారి

పిఠాపురంలో(Pithapuram) జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైసీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైసీపీ అభ్యర్ధి వంగా గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలలో 28 వేల ఓట్లు తనకు వచ్చాయని తెలిపారు. ‘పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు. పవన్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు. జనసేనకి అసలు విధివిధానాలే లేవు. పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు. జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయన్నారు.

Also Read : Mukesh Kumar Meena: పకడ్భందీగా ఎన్నికల కోడ్ అమలు – సీఈవో ముఖేశ్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!