KCR : జాతీయ రాజకీయాలలో తాను కీలక పాత్ర పోషిస్తానని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR ). ఇవాళ నారాయణ్ ఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. అందరినీ కూడ గడుతున్నా. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు కావాలన్నారు.
మనం బతుకు దెరువు కోసం యూఎస్ కు వెళ్లడం కాకుండా అమెరికన్లే మన వద్దకు వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్(KCR ). గొప్ప సంపద, వనరులు, యువశక్తి ఈ దేశంలో ఉన్నది.
ఇవాళ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఐటీ హబ్, ఫార్మా హబ్, అగ్రి హబ్ , ఆధ్యాత్మిక హబ్ గా మారిందన్నారు. వందలాది కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయన్నారు.
బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో బంగారు దేశాన్ని కూడా తయారు చేసుకుందామని స్పష్టం చేశారు కేసీఆర్. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే సైతం తమను అభినందించారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. పాలకుల చేతకాని తనం వల్లనే ఇవాళ దేశం ఇలా తయారైందన్నారు. మీ దీవెనలతో బంగారు భారత దేశం తయారు చేస్తామన్నారు కేసీఆర్.
Also Read : ఇద్దరు సీఎంల భేటీపై ఉత్కంఠ