Sanju Samson : ప‌రిస్థితుల‌కు త‌గ్గట్టుగా ఆడుతున్నా

కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్

Sanju Samson : కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జ‌ట్టు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆడాల్సి ఉంటుంద‌ని సూచ‌న‌లు వ‌చ్చాయ‌ని తెలిపాడు. అందుకే త‌న ఆట తీరులో మార్పు వ‌చ్చింద‌ని తెలిపాడు.

మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడాడు. సంజూ అంటేనే దూకుడుకు నిద‌ర్శ‌నం. సిక్స‌ర్లు అవ‌లీల‌గా కొట్ట‌గ‌ల‌డు. ప్ర‌ధానంగా ఎలాంటి బంతులైనా పైకి వ‌స్తే అత‌డికి పండ‌గే. ఈ త‌రుణంలో పుల్ ఫామ్ లో ఉన్న‌ప్ప‌టికీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక పోయాడు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.

భార‌త సెలెక్ట‌ర్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజా, మాజీ ఆట‌గాళ్లు సైతం మండిప‌డ్డారు. ఇక సోష‌ల్ మీడియాలో సంజూ శాంస‌న్ కు అన్యాయం జ‌రిగిందంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జ‌రిగింది. దెబ్బ‌కు చోటు క‌ల్పించాల్సిన ప‌రిస్థితి తీసుకు వ‌చ్చారు. దీంతో ప్ర‌స్తుతం వ‌న్డే జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు.

గ‌తంలో కంటే భిన్నంగా ఆడుతున్నాడు సంజూ శాంస‌న్. దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పై నుంచి త‌న‌కు స్థిరంగా ఆడాల‌ని సూచ‌న వ‌చ్చింద‌న్నాడు. వికెట్లు కోల్పోతున్నా త‌ను క్రీజులో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు.

అందుకే తాను ద‌క్షిణాఫ్రికాతో ఆడుతున్న స‌మ‌యంలో దీనినే ఫాలో అయ్యాన‌ని త‌లిపాడు సంజూ శాంస‌న్(Sanju Samson). దీని వ‌ల్ల జ‌ట్టుకు బ్యాక్ బోన్ గా ఉండేందుకు చాన్స్ ఏర్ప‌డుతుంద‌న్నాడు ఈ స్టార్ క్రికెట‌ర్.

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియాలో సంజూ అవ‌స‌రం భార‌త జ‌ట్టుకు ఉంద‌న్నాడు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి. ఇక తాజా సీరీస్ లో 86 , 30 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

Also Read : ఐపీఎల్ చైర్మ‌న్ రేసులో అరుణ్ ధుమాల్

Leave A Reply

Your Email Id will not be published!