PM Modi : భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త్ బ‌లం

ప్ర‌పంచానికి చాటి చెప్పిన నరేంద్ర మోదీ

PM Modi : భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త దేశానికి ఉన్న అతి పెద్ద బ‌లం అని అన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌వుతున్న సంద‌ర్బంగా ఆగ‌స్టు 15న దేశ రాజ‌ధాని ఢిల్లీ ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఎగుర వేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. జాతి అభ్యున్న‌తి కోసం మ‌నంతా ఐక్యంగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు. దేశ ప్ర‌గ‌తికి స‌మాన‌త్వం మూల స్తంభ‌మ‌న్నారు న‌రేంద్ర మోదీ.

ముందు భార‌త దేశం అనే మంత్రం ద్వారా ఐక్యంగా ఉన్నామ‌ని నిర్దారించు కోవాల‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య స‌మాన‌త్వం అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పారు. భార‌త దేశ వృద్దికి మహిళ‌ల ప‌ట్ల గౌరం ఒక ముఖ్య‌మైన పునాది అని పేర్కొన్నారు.

మ‌హిళా శ‌క్తికి మ‌నం మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విద్యుత్, నీటిని పొదుపు చేయ‌డం అత్యంత ముఖ్య‌మ‌న్నారు. దీనిని అనుస‌రిస్తే మ‌నం అనుకున్న ఫ‌లితాల‌ను ముందుగానే చేరుకోగ‌ల‌మ‌న్నారు.

ఈ విధులు దేశంలోని పౌరులంద‌రికీ వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) , ముఖ్య‌మంత్రుల‌తో స‌హా ఏ దేశ‌మైనా పురోగ‌మించినా దేశ పౌరుల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ వేళ్లూనుకుంద‌న్నారు.

అంతా త‌మ బాధ్య‌త‌ల‌ను పాటిస్తే దేశం వేగంగా పురోగ‌మిస్తుంద‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి. స‌మ‌ర యోధులు క‌ల‌లు క‌న్న దానిని సాధించాల‌నే దృక్ఫ‌థంతో మ‌నం ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి తొమ్మిదోసారి భార‌త దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం. ఇది ఓ రికార్డుగా చెప్ప‌వ‌చ్చు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి సంబంధించి.

Also Read : భార‌త దేశం ప్ర‌జాస్వామ్యానికి మార్గం

Leave A Reply

Your Email Id will not be published!