PM Modi RRR Oscar : ఆస్కార్ ద‌క్క‌డం దేశానికి గ‌ర్వ‌కార‌ణం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న

PM Modi RRR Oscar : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు స్పెష‌ల్ కేట‌గిరీ ఒరిజిన‌ల్ సాంగ్ లో ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంతో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi RRR Oscar)  స్పందించారు.

ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఇది భార‌త దేశానికి ల‌భించిన అరుదైన గుర్తింపుగా అభివ‌ర్ణించారు. భార‌తీయ సినిమా స్థాయిని మ‌రింత పెంచేలా చేసింద‌ని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళికి, న‌టీ న‌టులు రామ్ చ‌ర‌ణ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ , గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ , సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి, ఆలాపించిన రాహుల్ సిప్లిగంజ్ , కాల భైర‌వ‌ను అభినందించారు. భార‌త జాతి మొత్తం ఇవాళ గ‌ర్వంతో ఉప్పొంగుతోంద‌ని కితాబు ఇచ్చారు. ఇది తెలుగు వారి పండ‌గ మాత్ర‌మే కాదు యావ‌త్ దేశానికి సంబంధించిన పండుగ అని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi).

ఇది అసాధార‌ణ‌మైన విజ‌యం. నాటు నాటు పాట‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు. ఇది రాబోయే సంవ‌త్స‌రాల‌లో ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌ని పేర్కొన్నారు. చిత్ర బృందానికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు.

ఇవాళ ప్ర‌పంచానికి భార‌త దేశం స‌త్తా ఏమిటో తెలిసి వ‌చ్చేలా చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ(RRR Oscar)  అని కొనియాడారు. ప్ర‌స్తుతం భార‌త్ జి20 గ్రూప్ కు సార‌థ్యం వ‌హిస్తున్న వేళ ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు ది ఎలిఫెంట్ విష్పెర‌ర్స్ ఆస్కార్ అవార్డులు స్వంతం చేసుకున్నందుకు అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : భార‌త దేశానికి ద‌క్కిన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!