PM Modi Congratulate : ది ఎలిఫెంట్ విస్పరర్స్ గ్రేట్
దర్శక, నిర్మాతలకు ప్రధాని అభినందన
PM Modi Elephant Whisperes : ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారత దేశానికి చెందిన రెండు సినిమాలు ఆస్కార్ లు అందుకున్నాయి. తొలి చిత్రంగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ కు దక్కగా రెండోది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు లభించింది. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. భారత దేశం ఇవాళ మిమ్మల్ని చూసి గర్వపడుతోందని పేర్కొన్నారు. భారత దేశ సినీ రంగానికే కాదు ఈ విజయం యావత్ దేశానికి లభించిన గౌరమని పేర్కొన్నారు.
ది ఎలిఫెంట్ విష్పెరర్స్ మూవీ తనను ఎంతగానో కదిలించిందని తెలిపారు. ఏనుగుకు మనుషులకు మధ్య ఉన్న బంధాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించడం అభినందనీయమని పేర్కొన్నారు. భారత దేశం ఉప్పొంగుతోంది..మిమ్మల్ని చూసి గర్విస్తోందని ప్రశంసలతో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లు లాస్ ఏంజిల్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిష్టాత్మకమైన అవార్డులను స్వంతం చేసుకోవడం తనకు ఎంతగానో సంతోషం కలిగిస్తోందంటూ కితాబు ఇచ్చారు. ఇక ప్రధాన మంత్రితో పాటు భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ , మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ది ఎలిఫెంట్ విస్పరర్స్ , ఆర్ఆర్ఆర్ టీంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీంను ప్రత్యేకంగా అభినందించారు మోదీ(PM Modi Elephant Whisperes) . ప్రకృతికి అనుగుణంగా ఎలా జీవించాలనే దానిపై తీసినందుకు థ్యాంక్స్ అన్నారు.
Also Read : ఆస్కార్ దక్కడం దేశానికి గర్వకారణం