PM Modi : డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు జాతికి అంకితం
ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా
PM Modi : దేశంలో ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో భాగంగా ఆదివారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దేశానికి చెందిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డిబియు)ను జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బ్రిటీష్ పాలన నుండి భారత దేశం స్వతంత్రం పొంది 75 ఏళ్లవుతోందని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల మరింత లావాదేవీలు సులభం అవుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిబియులను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర బడ్జెట్ 2022-23 లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 75 జిల్లాలలో 75 డిబియులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా డిజిటల్ బ్యాంకు యూనిట్లు పని చేస్తాయని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. ఇదిలా ఉండగా డీబీయూలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కవర్ చేస్తాయని పేర్కొన్నారు.
ఈ డీబీయూలలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్ బ్యాంకులు, ఓ చిన్న ఫైనాన్స్ బ్యాంకు పాలు పంచుకుంటున్నాయని తెలిపారు.
డీబీయు అవుట్ లెట్ లు ప్రజలకు సేవింగ్స్ ఖాతా తెరవడం, బ్యాలెన్స్ చెక్, ప్రింట్ పాస్ బుక్, నిధుల బదిలీ, ఎఫ్‌డీలలో పెట్టుబడి, రుణ దరఖాస్తులు, జారీ చేసిన చెక్కుల కోసం స్టాప్ పేమెంట్ సూచనలు వంటి అనేక రకాల డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది.
Also Read : డాలర్ బలపడడం వల్లే రూపాయి పతనం