KTR Modi : మోడీ ప్రచారం తప్పా అభివృద్ది ఏది
ప్రధానమంత్రిని నిలదీసిన మంత్రి కేటీఆర్
KTR Modi : రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని(KTR Modi) టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు తొమ్మిదేళ్ల కాలంలో ఆర్భాట ప్రచారం తప్పా దేశానికి చేసింది ఒక్కటి లేదన్నారు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంలో ఉన్నంత శ్రద్ద పనుల ప్రగతిపై లేకుండా పోయిందన్నారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నా ఇప్పటి వరకు వాటిని ఉపయోగించుకునే సోయి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు కేటీఆర్.
తాము కొత్త రాష్ట్రంలో కొలువు తీరాక దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచామని చెప్పారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, స్టార్టప్ లలో టాప్ లో నిలిచామని తెలిపారు. కానీ కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వక పోగా ఇబ్బందులు సృష్టిస్తోందంటూ ఆరోపించారు కేటీఆర్(KTR Modi) .
ఇప్పటి దాకా 100 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నోట్ల కట్టలను ఎవరికి మేలు చేకూర్చేలా చేశారో దేశ ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేటీఆర్. కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన పథకాలన్నీ నిరుపయోగంగా మారాయని ఆరోపించారు.
జీఎస్టీ పరంగా తాము భారీ ఎత్తున చెల్లిస్తే కనీసం 20 శాతం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. కానీ తాము గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకు వచ్చామని చెప్పారు కేటీఆర్. దావోస్ లో జాతీయ మీడియాతో మాట్లాడారు మంత్రి.
Also Read : మోడీ రాకకు ముహూర్తం ఫిక్స్