PM Modi : ఒక్క అవకాశం ఇస్తే ఢిల్లీ అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుంది
ఢిల్లీలో ఈరోజు వేల కోట్లు విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది...
PM Modi : ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కోరారు. దేశ రాజధానిని అభివృద్ధి చేయగలిగే పార్టీ ఒక్క బీజేపీయేనని అన్నారు. రోహిణిలో ఆదివారంనాడు జరిగిన ‘బీజేపీ పరివర్తన యాత్ర’ లో ఆయన మాట్లాడుతూ, మనం 2025 సంవత్సరంలో ఉన్నామని, 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయని, శతాబ్దంలో పావు సంవత్సరం ముసిగిపోయిందని అన్నారు. ఈ 25 ఏళ్లలో రెండు, మూడు తరాల యువతరం ఢిల్లీలో ఎదిగిందని, రాబోయే 25 ఏళ్లు భారతదేశ భవిష్యత్తుకు, ఢిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకమని చెప్పారు. ఈ పాతికేళ్లలో దేశం ‘వికసిత్ భారత్’గా రూపొందనుందని అన్నారు.
PM Modi Comment
”ఢిల్లీలో ఈరోజు వేల కోట్లు విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. రాబోయే 25 ఏళ్లు, దేశానికి, ఢిల్లీకి చాలా కీలకం. వికసత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తు్న్నాం” అని ప్రధాని చెప్పారు. ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఢిల్లీని బీజేపీ అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తుందని భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో ‘విపత్తు’ నే చూశామని, అభివృద్ధేనే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని నమ్మకం ప్రజలకు ఉందని అన్నారు. ప్రజావిశ్వాసం చూరగొనడం వల్లే హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర వంటి పలు ఎన్నికల్లో పార్టీ గెలుపొందిందని, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తుందనే గట్టి నమ్మకం ఉందన్నారు. ఢిల్లీకి ప్రపంచంలోనే ఉత్తమ నగర హోదాను తీసుకురాగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ అన్నారు. ‘ఆప్‌దా’ను ఢిల్లీ నుంచి తొలగించి ఢిల్లీ ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు.
Also Read : AP CM Chandrababu : సీఎం కుప్పానికి రాకముందే వరాల జల్లులు