PM Modi-CM Stalin : ‘ఫేంగల్’ తుపాను నష్టంపై సీఎం స్టాలిన్ తో ఫోన్లో ఆరా తీసిన ప్రధాని
ఇదిలా వుంటే,ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు...
PM Modi : ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తుఫాను బాధిత జిల్లాల్లో జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
PM Modi Talk to CM MK Stalin
ఇదిలా వుంటే,ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. ఫెంగల్ తుఫాన్ సృష్టించిన నష్టంపై ప్రధాని మోదీ ఫోన్ చేసారని చెప్పారు. ఈ సందర్భంగా తుఫాను ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించినట్టు తెలిపారు. అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యం వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని తక్షణం రాష్ట్రానికి పంపించాలని, వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం అందజేయాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. తుఫాను ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తుందని భావిస్తున్నట్టు సీఎం స్టాలిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read : Minister Ponmudy : వరద సాయం అందలేదన్న కోపంతో మంత్రి పై బురద చల్లిన బాధితులు