PM Modi-Roadshow : గుజరాత్ పర్యటనలో పాక్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
పహల్గామ్ ఘటన దేశాన్ని కదిలించింది....
PM Modi : గుజరాత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాహోద్ సభలో పాక్‌ను చీల్చిచెండాడారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పిల్లల ముందు తండ్రిని దారుణంగా చంపి ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులకు సవాల్ విసిరారని అన్నారు. మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు చూపించామన్నారు. పహల్గామ్ దాడి దృశ్యాలు గుర్తుకు వస్తే ఇప్పటికి కూడా తన రక్తం మరిగిపోతోందని మోదీ(PM Modi) పేర్కొన్నారు.. భారత మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేసినట్టు ప్రకటించారు. పహల్గామ్ దాడికి భారత ప్రజలు కోరుకున్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పాక్‌లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. భారతదేశ మహిళలకు హాని కలిగించేవారు లేదా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు మట్టిలో కలవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.
PM Modi Roadshow in Gujarat
పహల్గామ్ ఘటన దేశాన్ని కదిలించింది.. కఠినమైన చర్య తీసుకోవాలని అంతా డిమాండ్ చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న, దాడి చేసిన వారిని ఆపరేషన్ సిందూర్ తో మట్టిలో కలిపేశామన్నారు. సైన్యానికి స్వేచ్ఛా హస్తం ఇచ్చామని.. దశాబ్దాలుగా ప్రపంచం చూడనిది తాము సాధించి చూపించామన్నారు. మహిళల సిందూరాన్ని తొలగించే ధైర్యం చేయండి.. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ.. ప్రధాని మోదీ పాకిస్తాన్, ఉగ్రవాదులను హెచ్చరించారు.
11 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రధాని పగ్గాలు చేపట్టానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో మే 26ని ఒక ముఖ్యమైన రోజని పేర్కొన్నారు. 2014లో ఇదే తేదీన తాను తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. “ఈ రోజు మే 26. 2014లో ఇదే తేదీన, నేను మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను… మొదట, గుజరాత్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు, తరువాత కోట్లాది మంది భారతీయులు నన్ను ఆశీర్వదించారు.’’ అంటూ మోదీ పేర్కొన్నారు.
వడోదర తర్వాత దాహోద్‌కు వెళ్లిన ప్రధాని, భారతీయ రైల్వేలకు కొత్త గిఫ్ట్ ఇచ్చారు. దాహోద్‌లో రైలు ఇంజిన్ల తయారీ కర్మాగారాన్నిదేశానికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి ఎలక్ట్రిక్ రైల్ ఇంజిన్‌కు ప్రధాని పచ్చజెండా ఊపారు. – భారతీయ రైల్వేల లోడింగ్ కెపాసిటీ పెంచబోతున్నాయి ఈ రైలు ఇంజిన్లు. ఇక్కడ 9000 హార్స్‌పవర్ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్ల ఉత్పత్తి చేస్తారు. వేలాది కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Also Read : Kakani Govardhan Reddy : మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్