PM Modi Joe Biden : ఇండో పసిఫిక్ పై మోదీ..బైడన్ చర్చ
22న ప్రధానమంత్రి అమెరికా పర్యటన
PM Modi Joe Biden : భారత దేశంతో వ్యూహాత్మకంగా భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది జోసెఫ్ బైడెన్(Joe Biden) నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం. .ఇప్పటికే ఆ దేశానికి చెందిన రక్షణ శాఖ కార్యదర్శి లాయడ్ ఆస్టిన్ ఇండియాలో పర్యటించారు. ఇందులో భాగంగా కీలక అంశాలపై చర్చించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో. ఇదే క్రమంలో ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్. తనతో వైట్ హౌస్ లో విందుకు హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించి ప్రభుత్వాలు మోదీ పర్యటనకు సంబంధించి ఖరారు చేశాయి.
ఇందులో భాగంగా బైడెన్ చాలా సార్లు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన ముందు చూపు, నాయకత్వ నైపుణ్యం బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా మోదీ టూర్ ఖరారైంది. ఆయన జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. కాగా మోదీ వెంట ఎవరు వెళతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి టూర్ ప్రోగ్రామ్ గురించి అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుంది.
ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ,, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ మధ్య జరిగే చర్చల్లో ప్రధానంగా ఇండో పసిఫిక్ అంశం రానున్నట్టు సమాచారం. అయితే తాజాగా వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అదేమిటంటే రెండు దేశాలను బలోపేతం చేసే మార్గాలపై ప్రధాని మోదీ , ప్రెసిడెంట్ బైడెన్ చర్చిస్తారని స్పష్టం చేసింది.
Also Read : Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కంట తడి