PM Modi Focus : క‌న్న‌డ నాట మోదీనే ప్ర‌చార అస్త్రం

ఫోక‌స్ పెట్టిన బీజేపీ అధిష్టానం

PM Modi Focus Karnataka : క‌న్న‌డ నాట మ‌రోసారి డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆ పార్టీకి అన్నీ తానైన మాజీ సీఎం బీఎస్ యెడియూర‌ప్ప అనూహ్యంగా తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఏప్రిల్ – మే నెల‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మ‌రో వైపు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర తీవ్ర ప్ర‌భావం చూపింది. క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి , ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఒక కాంట్రాక్ట‌ర్ ఏకంగా తాను లంచాలు ఇవ్వ‌లేక చ‌నిపోతున్నానంటూ పేర్కొన్నారు. రాసిన లేఖ‌లో వెల్ల‌డించారు. 

ఈ మొత్తం వ్య‌వ‌హారం ప‌క్క‌న పెడితే మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌న్న‌ది బీజేపీ ప్లాన్ . అందులో భాగంగా బీజేపీ ప‌దే ప‌దే క‌ర్ణాట‌క ను టార్గెట్ చేసింది. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని జార విడుచు కోకుండా శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 

ఇప్ప‌టికే రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయ‌న ప‌లుమార్లు జ‌ల్లెడ ప‌ట్టారు. రాష్ట్ర ఎన్నిక‌ల ఇంఛార్జ్ ల‌ను ఇప్ప‌టికే బీజేపీ ఏర్పాటు చేసింది. 

మ‌రో వైపు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా క‌ర్ణాట‌క‌లోనే ఉన్నారు. వ్యూహాల‌కు ప‌దును పెడుతూ ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌ధానంగా బీజేపీ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. అంతే కాదు కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధుల‌ను విడుద‌ల చేసింది. 

అంతే కాదు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారేందుకు గాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని(PM Modi Focus Karnataka)  ప్ర‌చార అస్త్రంగా దించింది బీజేపీ. ప్రారంభోత్స‌వాలు, రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌తో హోరెత్తిస్తున్నారు మోదీ. మొత్తంగా మోదీనే న‌మ్ముకుంది బీజేపీ.

Also Read : మోదీతో ఉద‌య‌నిధి స్టాలిన్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!