PM Modi : ఈజిప్టు అధ్య‌క్షుడితో మోదీ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని ప్ర‌స్తుతం ఈజిప్టులో ప‌ర్య‌టిస్తున్నారు. కొన్నేళ్ల త‌ర్వాత దేశ ప్ర‌ధాని ఈజిప్టును సంద‌ర్శించ‌డం విశేషం. మోదీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. భార‌త, ఈజిప్టు దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు కొన‌సాగుతున్నాయి. ఈజిప్టు అధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌తా ఎల్ -సిసి త‌మ దేశంలో ప‌ర్య‌టించాల‌ని ఆహ్వానించారు న‌రేంద్ర మోదీని. ఈ మేర‌కు ప్ర‌ధాని ప‌ర్య‌టిస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే భార‌త దేశం నుంచి ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) ప‌ర్య‌టించడం 26 ఏళ్ల త‌ర్వాత కావ‌డం. ఈజిప్టు ప్ర‌ధాని డాక్ట‌ర్ షాకీ ఇబ్ర‌హీం అబ్దెల్ క‌రీంతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. వాణిజ్య సంబంధాల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. అంత‌కు ముందు ఈజిప్టు కౌంట‌ర్ మోస్త‌ఫా , క్యాబినెట్ మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు న‌రేంద్ర మోదీ. అనంత‌రం ప్ర‌వాస భార‌తీయుల‌ను క‌లుసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి. వారితో చాలా సేపు ముచ్చ‌టించారు.

అక్క‌డి నుంచి నేరుగా ప్ర‌పంచంలోనే పేరు పొందిన కైరో లోని అల్ హ‌కీమ్ మ‌సీదును సంద‌ర్శించారు. న‌రేంద్ర మోదీకి ఈజిప్టు ప్ర‌భుత్వం గార్డ్ ఆఫ్ హాన‌ర్ ల‌భించింది. ఇదిలా ఉండ‌గా భార‌త్ తో ద్వైపాక్షిక సంబంధాల‌ను పెంచు కోవాల‌ని తాము అనుకుంటున్న‌ట్లు ఈజిప్టు ప్ర‌క‌టించింది.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం భ‌క్త జ‌న సందోహం

Leave A Reply

Your Email Id will not be published!