PM Modi : 10 లక్షల ఉద్యోగాల భర్తీకి మోదీ ఆదేశం
మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రకటన
PM Modi : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi) సంచలన ప్రకటన చేశారు. రాబోయే 18 నెలల్లో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు అన్ని శాఖలు కొలువుల భర్తీకి సంబంధించి కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించారు పీఎం. మిషన్ మోడ్ కింద ఈ నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం ప్రధాన మంత్రి మోదీ మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలో వనరుల స్థితిగతులను పీఎం ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. ఈ మేరకు వెంటనే భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశంచారు మోదీ.
ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయంలో మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ప్రధానంగా దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలు దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదంటూ గత కొంత కాలంగా నిప్పులు చెరుగుతూ వస్తున్నారు.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఏకంగా ఏయే శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో భారీ డేటాను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. వరుణ్ గాంధీకి ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు.
పనిలో పనిగా మోదీ(PM Modi) మన్ కీ బాత్ కథలు చెప్పడం మానేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కొలువుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
2024లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read : రాష్ట్రపతి పదవి రేసులో నేను లేను – నితీష్