Rahul Gandhi : పాల‌న కంటే ప్ర‌చారం పైనే మ‌క్కువ‌ – రాహుల్

అవినీతి..ద్ర‌వ్యోల్బ‌ణం..నిరుద్యోగం

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు మోదీపై. దేశంలో ఓ వైపు అవినీతి అన‌కొండ‌లా పేరుకు పోయింద‌ని , ఇంకో వైపు ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని కానీ బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి నిద్ర పోతున్నారా అని ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారం క‌ర్ణాట‌క నుంచి ఏపీలోకి ఎంట‌ర్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శైల‌జ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. 14 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్టిన అనంత‌రం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ఈ దేశం గురించి మాట్లాడాల్సి వ‌స్తే స‌మ‌స్య‌లు కోకొల్ల‌లు.

మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఈ ఎనిమిదేళ్ల కాలంలో సాధించింది ఏమీ లేద‌ని చెప్పుకోవ‌డానికి ఏమీ లేద‌న్నారు. కొంద‌రి వ్యాపార‌వేత్త‌ల కోసం త‌ను ప‌ని ప్ర‌ధానిగా ఉన్నార‌ని కానీ 135 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం లేదంటూ మండిప‌డ్డారు.

ఓ వైపు చ‌క్క‌దిద్దాల్సిన ఆర్థిక మంత్రి అబ‌ద్దాల లెక్క‌ల‌తో మ‌భ్య పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. మ‌న్ కీ బాత్ కంటే ముందు దేశానికి ఈ స‌మ‌స్య‌ల‌ను ఎందుకు ప‌రిష్క‌రించ లేక పోతున్నార‌నే దానిపై న‌రేంద్ర మోదీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌ధాన మంత్రికి పాల‌న కంటే ప్ర‌చారం ఎలా చేసుకోవాలనే దానిపై మ‌క్కువ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ద్ర‌వ్యోల్బ‌ణం 35 ఏళ్ల గ‌రిష్ట స్థాయికి ఎందుకు ఉందో చెప్పాలి. నిరుద్యోగం 45 ఏళ్ల గ‌రిష్ట స్థాయికి ఎందుకు ప‌డి పోయిందో స‌మాధానం ఇవ్వాల‌న్నారు. పేద‌లు తీసుకునే ప‌రాటాల‌కు 18 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

Also Read : గుజ‌రాత్ లో బీజేపీకి అంత సీన్ లేదు

Leave A Reply

Your Email Id will not be published!