PM Modi Bal Thackeray : మరాఠా యోధుడికి మరణం లేదు
బాల్ ఠాక్రేను స్మరించుకున్న ప్రధానమంత్రి
PM Modi Bal Thackeray : మరాఠా యోధుడు , శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే 97వ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని , జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన జీవించిన కాలంలో తాను ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. బాల్ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన తనకు స్పూర్తిని కలిగించారని కొనియాడారు.
ఇవాళ ఆయన లేక పోయినా ఆశయాలు, ఆలోచనలు ఎప్పటికీ నిలిచే ఉంటాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. సోమవారం ట్విట్టర్ వేదికగా మరాఠా యోధుడిని ప్రశంసలతో ముంచెత్తారు. బాల్ ఠాక్రే ఒక వ్యక్తి కాదని ఓ శక్తి వంతమైన నాయకుడు, మార్గదర్శకుడు అని కొనియాడారు. ఆయనతోనా పరస్పర చర్యలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ(PM Modi Bal Thackeray). ఆయన గొప్ప జ్ఞానం కలిగి ఉన్నారు.
తన జీవితమంతా ప్రజా సంక్షేమం కోసం అంకితం చేశారని ప్రశంసించారు. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని, పుడతారని పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల ప్రారంభ మార్గదర్శకులలో ఒకరైన మరాఠా యోధుడితో తన పరస్పర చర్యలనుత ఆను ఎంతో ఆదరిస్తానని , ఆయనను అనుసరించిన వాళ్లు కోట్లల్లో ఉన్నారని ఇది ఆయన నాయకత్వ పఠిమకు దర్పణమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా శివసేన రెండుగా చీలి పోయింది. ఒక వర్గం బాల్ ఠాక్రే కాగా మరో వర్గం షిండేగా చీలి పోయింది. దీనికి ప్రధాన కారణం మోడీ, అమిత్ షా అంటూ ఆరోపించారు బాల్ ఠాక్రే తనయుడు , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే.
Also Read : ఆ ద్వీపాలు ఇక పరమచక్ర విజేతలు