PM Modi : ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో అభివృద్ది

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : తాము తీసుకు వ‌చ్చిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌తో దేశం అన్ని రంగాల‌లో అభివృద్ది ప‌థంలో దూసుకు పోతోంద‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. మోదీ పీఎంగా కొలువు తీరి 9 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్బంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల గురించి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. ఇందులో బాగంగా దేశ వ్యాప్తంగా గ‌త నెల మే 30 నుంచి ప్ర‌చార కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జూన్ 30 వ‌ర‌కు ఈ ప్ర‌చారోత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టకే ప‌లు చోట్ల బీజేపీ స‌భ‌లు, స‌మావేశాలు, స‌ద‌స్సులు, ర్యాలీలు చేప‌డుతోంది.

ఈ సంద‌ర్భంగా సోమవారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో పాల‌కులు కేవ‌లం త‌మ స్వార్థం మాత్ర‌మే చూసుకున్నార‌ని కానీ తాము వ‌చ్చాక సామాన్యుల‌కు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్ర‌య‌త్నం చేశాన‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. పెద్ద ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని వాటిని నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నాన‌ని పేర్కొన్నారు పీఎం.

నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ఎంతో బ్లాక్ మ‌నీ ఎక్క‌డిక‌క్క‌డ ప‌నికి రాకుండా పోయింద‌న్నారు. దీనివ‌ల్ల అక్ర‌మార్కుల ఆట‌లు సాగ‌వ‌న్నారు. ప్ర‌స్తుతం రూ. 2 వేల నోట్ల‌ను కూడా ర‌ద్దు చేశామ‌ని దీని వ‌ల్ల త‌మ వ‌ద్ద క‌లిగిన అక్ర‌మ సంపాద‌న‌కు లెక్కా పత్రం చూపించాల్సిన పరిస్థితుల‌ను తీసుకు వ‌చ్చాన‌ని తెలిపారు న‌రేంద్ర మోదీ. గ‌తంలో వ్య‌వ‌స్థ‌ల‌ను త‌మ గుప్పిట్లో పెట్టుకున్నార‌ని కానీ తాము వ‌చ్చాక అంద‌రికీ చెందేలా చేశామ‌న్నారు.

Also Read : CM Siddaramaiah : సీఎం సారూ స‌ల్లంగుండాల

 

Leave A Reply

Your Email Id will not be published!