PM Modi : భారత్ కు ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదు
ప్రపంచమే మనల్ని చూసి నేర్చుకుంటోంది
PM Modi : సమున్నత భారతావనికి ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్బంగా ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మనల్ని చూసి యావత్ ప్రపంచం నేర్చుకుంటోందన్నారు. మహమ్మారి కరోనాను చూసి ఇతర దేశాలు వణికి పోతే తాము మాత్రం అధిగమంచడం జరిగిందన్నారు మోదీ.
ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువతపై ఆధారపడి ఉందన్నారు. మన దేశం ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పికే లోకం గుర్తించిందన్నారు.
ఇంకొకరి సర్టిఫికెట్ మనకు అక్కర్లేదన్నారు ప్రధాన మంత్రి. వలసవాద పక్షపాతాలు, దాస్యపు బంధనాలను విడనాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతరుల లాగా కాకుండా మనల్ని చూసి ఇతరులు మారేలా ప్రయత్నం చేయాలన్నారు.
మన ఆలోచనల్లో బానిసత్వపు జాడ ఉండ కూడదన్నారు. మేకిన్ ఇండియా అన్నది మన నినాదం కావాలన్నారు మోదీ. మనకున్నంత గొప్పనైనా వారసత్వం ఏ దేశానికి లేదన్నారు.
యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే స్థాయికి భారత్ ఎదగాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా దేశం ముందుకు సాగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు నరేంద్ర మోదీ.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను నిరంతరాయంగా సాగాలన్నారు. అందుకే హర్ ఘర్ తిరంగా కు శ్రీకారం చుట్టామన్నారు. ఈ దేశం ఇద్దరిపై ఆధారపడి ఉందన్నారు. వారిలో ఒకరు రైతులైతే మరొకరు సైనికులన్నారు నరేంద్ర మోదీ(PM Modi).
Also Read : భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం