PM Modi : దేశం కోసం క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌దు – మోదీ

అగ్నిప‌థ్ స్కీంపై తీవ్ర వ్య‌తిరేకత‌పై కామెంట్

PM Modi : దేశ భ‌విష్య‌త్తు దృష్ట్యా కొన్ని క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఇందులో కొంద‌రు బాధ ప‌డ‌డంలో అర్థం ఉంద‌న్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.

ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌ల ప్ర‌భుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ అగ్నిప‌థం ప‌థ‌కం రాజేసిన అగ్గి ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ(PM Modi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపాయి. కొన్ని నిర్ణ‌యాలు అన్యాయంగా క‌నిపిస్తున్నాయ‌న్న‌ది నిజ‌మేన‌ని పేర్కొన్నారు.

కానీ ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు దీర్ఘ‌కాలంలో దేశ నిర్మాణంలో స‌హాయ ప‌డుతాయ‌ని, ఆ విష‌యాన్ని గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు మోదీ(PM Modi). క‌ర్ణాట‌క‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం బెంగ‌ళూరులో బ‌హిరంగ ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌తిప‌క్షాలు అర్థం చేసుకోకుండానే గుడ్డిగా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ప‌థ‌కాన్ని వాళ్లు పూర్తిగా చ‌ద‌వ‌లేద‌ని నా అభిప్రాయం. ఒక వేళ వాళ్లు పూర్తిగా చ‌దివి ఉండి ఉంటే ఇలా అగ్నిప‌థ్ స్కీం గురించి విమ‌ర్శించే వాళ్లు కాద‌న్నారు మోదీ.

ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే కొన్ని మార్పులు చేయ‌క త‌ప్ప‌ద‌న్నారు. టెక్నాల‌జీ మారుతోంది. దానిని గుర్తించి ఇప్ప‌టి అవ‌స‌రాల‌కు అనుగుణంగా వ‌ర్తింప చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందులో భాగంగానే అగ్ని ప‌థ్ ను తీసుకు వ‌చ్చామ‌న్నారు.

Also Read : అగ్నిప‌థ్ భ‌ర్తీకి ఆర్మీ నోటిఫికేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!