PM Modi 4th Test : నా హృదయం క్రికెట్ మయం – మోదీ
మీ అపూర్వమైన ఆదరణకు థ్యాంక్స్
PM Modi 4th Test : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ కీలక మ్యాచ్ కు విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ . కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా ఇరు జట్లకు సంబంధించిన కెప్టెన్లు, ఆటగాళ్లతో కరచాలనం చేశారు.
అంతకు ముందు ఇరు ప్రధానులు గ్రౌండ్ చుట్టూ తిరిగారు. ప్రపంచ క్రికెట్ రంగంలో అతి పెద్ద క్రీడా స్టేడియంగా పేరు పొందింది నరేంద్ర మోదీ అహ్మదాబాద్ స్టేడియం(PM Modi 4th Test). ఇందులో ఒకే సారి ఒక లక్షా 10 వేల మంది కూర్చునే సదుపాయం ఉంది. ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. స్టేడియం అంతా హర్ష ధ్వానాలతో, నినాదాలతో హోరెత్తింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ కామెంటేటర్ , మాజీ కెప్టెన్ , మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యవహరించారు.
ప్రధానులు మోదీ, ఆంథోనీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ , గవర్నర్ , భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బాస్ రోజర్ బిన్నీ , కార్యదర్శి జే షా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి పీఎం ఉన్న ఫోటోను బహూకరించారు జేషా. మ్యాచ్ లో తనకు లభించిన అపూర్వమైన స్వాగతం గురించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
నా హృదయం క్రికెట్ మయంగా మారి పోయిందంటూ పేర్కొన్నారు ప్రధానమంత్రి(PM Modi 4th Test). ఈ సందర్బంగా నరేంద్ర మోదీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : మోదీ ఆంథోనీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
