PM Modi : స‌వాళ్ల‌ను ఎదుర్కొంటేనే రాణించ‌గ‌లం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న

PM Modi : ప్ర‌తి రంగంలో స‌వాళ్లు ఉంటాయి. స‌వాళ్లను క‌ష్టంగా భావించ కూడ‌దు. మ‌న స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షించేందుకు ఇవి తోడ్పాటు అందిస్తాయ‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). ఆదివారం జాతీయ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. జాతి నిర్మాణంలో శిక్ష‌ణ అన్న‌ది నిరంత‌రం సాగే ప్ర‌క్రియ అని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు నేర్చుకోవ‌డం వ‌ల్ల ప‌రిణ‌తి సాధించేందుకు వీలు క‌లుగుతుంద‌ని అన్నారు మోదీ.

వృత్తిలో నైపుణ్యం, మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. సామ‌ర్థ్యాల పెంపుద‌ల అనేది కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. స‌ర్వీస్ డెలివ‌రీని మెరుగు ప‌ర్చ‌డం అన్న‌ది ప్ర‌ధానం కావాల‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. భార‌త దేశం పెను స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది. ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉంద‌ని అన్నారు.

మ‌న ముందున్న ల‌క్ష్యం పెద్ద‌ది కావ‌చ్చు. ఈ కార్య‌క్ర‌మంలో తాను ఒక్క‌డినే ప‌ని చేస్తే స‌రి పోద‌ని మీరంద‌రూ కూడా త‌న‌తో పాటు క‌లిసి న‌డిస్తే ఆశించిన ఫలితాలు అందుకోగ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ప్ర‌పంచం మెరుపు వేగంతో న‌డుస్తోంది. కానీ మ‌నం ఇంకా దానిని అందుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.

Also Read : CM KCR : తెలంగాణ చారిత్ర‌క వార‌స‌త్వానికి ప్ర‌తీక‌

Leave A Reply

Your Email Id will not be published!