Modi Security : మోదీ పంజాబ్ టూర్ లో లోపాలు నిజ‌మే

భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం

Modi Security :  భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా పంజాబ్ నుండి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు గ‌త జ‌న‌వ‌రిలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. దేశ వ్యాప్తంగా సెక్యూరిటీ లోపంపై భ‌గ్గుమంది.

చ‌ర్చ‌కు దారి తీసింది. పీఎం సెక్యూరిటీ లోపంపై స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ సంద‌ర్భంగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది గురువారం.

పంజాబ్ పోలీసుల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింద‌ని పేర్కొంది. సిట్స్ నివేదిక కూడా ఇదే వెల్ల‌డించింద‌ని తెలిపింది. జ‌స్టిస్ ఇందు మ‌ల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల క‌మిటీ విచార‌ణ చేప‌ట్టింది.

అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైనందుకు ఫిరోజ్ పూర్ సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ పై అభియోగాలు మోపింద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

పంజాబ్ లో పీఎం ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో చోటు చేసుకున్న భ‌ద్ర‌తా లోపం , ఉల్లంఘ‌న కార‌ణంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపింది క‌మిటీ.

పంజాబ్ పోలీసుల తీరులో లోపాల‌ను గుర్తించింద‌ని కోర్టు పేర్కొంది. లా అండ్ ఆర్డ‌ర్ ను కాపాడ‌టంలో ఎస్ఎస్పీ విఫ‌ల‌మ‌య్యాడు. త‌గినంత బ‌లగం అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ మార్గంలో ప్ర‌వేశిస్తార‌ని రెండు గంట‌ల ముందు తెలియ చేశారు.

రూట్ ను క్లియ‌ర్ చేయ‌డంలో, భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన‌ట్లు నివేదిక పేర్కొంద‌ని తెలిపింది సుప్రీంకోర్టు.

ప్ర‌ధాన మంత్రి భ‌ద్ర‌త‌ను(Modi Security) ప‌టిష్టం చేసేందుకు ఐదుగురు స‌భ్యుల క‌మిటీ దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను సూచించింద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

Also Read : పెగాస‌స్ స్పైవేర్ పై సీజేఐ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!