PM Modi : ఈ బడ్జెట్ మహిళలు మరియు యువతకు ఆశాకిరణం

బడ్జెట్‌పై కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ....

PM Modi : కేంద్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌కు ఆమోదం తెలపడానికి ముందు కేంద్ర కేబినెట్‌ సమావేశం అయింది. ఈ కేబినెట్‌ భేటీలో ప్రధాని మోదీ కీలకవ్యాఖ్యలు చేశారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు, యువకుల ఆశల బడ్జెట్‌ అంటూ పేర్కొన్నారు.ఇది పేదలు, మధ్యతరగతి, రైతుల బడ్జెట్‌ అని.. అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయంటూ మోదీ(PM Modi) వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ బడ్జెట్‌ ఎలా ఉంటుందో మోదీ మరోసారి బిగ్‌ హింట్‌ ఇచ్చారు.

PM Modi Comment

బడ్జెట్‌పై కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ.. ప్రసంగిస్తూ 2025 బడ్జెట్ సామాన్యుల కోసమేనని, పేద రైతులు, మహిళలు, యువత ఆకాంక్షలను ఈ ఏడాది బడ్జెట్‌ నెరవేరుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని.. అందరి ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ.. వ్యాఖ్యలతో కేంద్ర బడ్జెట్‌ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యువత, మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు? వ్యవసాయరంగం, రైతులపై ఎలాంటి వరాలు ఉండబోతున్నాయ్‌? ఆరోగ్యరంగానికి ఈసారి ఎలాంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందని.. అసలు బడ్జెట్‌ మహిళల ఆశలు ఏంటి? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందలను ఎదుర్కుంటున్నప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేవిధంగా నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారంటూ పేర్కొన్నారు.

Also Read : AP Registration Charges Hike : నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల

Leave A Reply

Your Email Id will not be published!