PM Modi No 1 : ప్రపంచంలో నెంబర్ వన్ లీడర్ మోదీ
రెండో స్థానంలో మెక్సికన్ చీఫ్ లోపెజ్
PM Modi No 1 : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ అరుదైన ఘనత సాధించారు. 78 శాతం రేటింగ్ తో మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ ల జాబితాలో ప్రధానమంత్రి అగ్ర స్థానంలో ఉన్నారు. సర్వే రేటింగ్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ఫ్రెంచ్ చీఫ్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి రిషి సునక్ కూడా జాబితాలో ఉన్నారు.
అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సర్వే చేపట్టింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi No 1) ప్రపంచం లోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. వరుసగా మోస్ట్ పాపులర్ లీడర్ గా నిలిచారు ప్రధానమంత్రి. ఇదిలా ఉండగా ఈ పోల్ రేటింగ్స్ కోసం 22 ప్రపంచ లీడర్లను సర్వే చేపట్టింది.
ఈ ఏడాది జనవరి 26 నుంచి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా జాబితా రూపొందించింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ప్రకారం మోదీకి జనాదరణలో టాప్ లో నిలిచారని వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే మోదీ కంటే చాలా ఆదరణ విషయంలో కేవలం 40 శాతం పొందారు జోసెఫ్ బైడెన్. ఇక మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ 68 శాతం రేటింగ్ లతో రెండవ స్థానంలో నిలిచారు.
స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్స్ 62 శాతం ఆమోదపు రేటింగ్ తో మూడో స్థానాన్ని పొందారు. రష్యా చీఫ్ పుతిన్ తో మోదీ ఇది యుద్ద యుగం కాదన్నారు. ఈ మెస్సేజ్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని సంస్థ పేర్కొంది.
Also Read : యుఎస్ హౌస్ ప్యానల్స్ లో ఎన్నారైలు