PM Modi Tour : తెలంగాణలో మోదీ టూర్
7,11 తేదీలలో రానున్న పీఎం
PM Modi Tour : న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మొత్తం 119 సీట్లకు గాను రెండు జాబితాలను ప్రకటించింది పార్టీ. మూడో విడతకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది.
PM Modi Tour to Telangana
రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్కువగా దృష్టి సారించారు. క్యాంపెయిన్ లో భాగంగా ఈనెల 7, 11 తేదీలలో జరిగే బీజేపీ సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
7న బీసీ ఆత్మ గౌరవ సదస్సులో పాల్గొంటారు. 11న మాదిగ, ఉప కులాల విశ్వ రూప మహా సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) హాజరవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు చోట్ల మోదీ ఇప్పటికే సభల్లో పాల్గొని ప్రసంగించారు.
ఈసారి ఎన్నికల్లో కీలక ప్రకటన చేసింది బీజేపీ. ఇందులో భాగంగా తాము పవర్ లోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించారు. బీసీ కార్డుతో ఎన్నికల్లో ప్రచారం చేయనుంది బీజేపీ. బీసీ కార్డు ఉపయోగిస్తే ఓట్లు పడతాయని భావిస్తోంది హైకమాండ్. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారి పోయింది.
Also Read : TPCC Chief : ఐటీ దాడులకు భయపడం