PM Modi Tour : ఓరుగ‌ల్లుకు రానున్న మోదీ

ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్దం

PM Modi Tour : తెలంగాణ‌లో మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఓరుగల్లులో కాలు మోప‌నున్నారు . జూలై 8న శ‌నివారం ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా బీజేపీ కొత్త చీఫ్ కిష‌న్ రెడ్డి సార‌థ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీనియ‌ర్ నేత‌లు ఇక్క‌డే మ‌కాం వేశారు. భారీ ఎత్తున జ‌నాన్ని త‌ర‌లించే ప‌నిలో ప‌డ్డారు. మ‌రో వైపు అధికారిక కార్య‌క్ర‌మం కావ‌డంతో ప్రోటోకాల్ ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్ రాజ‌న్ తో పాటు సీఎం కేసీఆర్ కు కూడా పార్టీ ఆహ్వానం ప‌లికింది.

అయితే మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏం మొహం పెట్టుకుని తెలంగాణ‌కు మోదీ(Modi) వ‌స్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న పైకి ప్రేమ క‌న‌బ‌రుస్తూనే లోప‌ల తెలంగాణ ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇక మోదీ టూర్ విష‌యానికి వ‌స్తే వ‌రంగ‌ల్ లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఎక్క‌డ చూసినా పోలీసులే మోహ‌రించారు. హై సెక్యూరిటీ జోన్ గా మార్చేశారు. న‌గ‌రం చుట్టూ 20 కిలోమీట‌ర్ల లోపు 144 సెక్ష‌న్ అమ‌లు చేయ‌నున్నారు. మోదీ వ‌రంగ‌ల్ టూర్ లో భాగంగా భ‌ద్ర‌కాళి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు.

ఉద‌యం 9.45 గంట‌ల‌కు హ‌కీంపేట‌కు మోదీ చేరుకుంటారు. 10.15 గంట‌ల‌కు మామునూరుకు వెళ‌తారు. 11 గంట‌ల‌కు కాలేజీ మైదానంకు చేరుకుంటారు. 6,110 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టే జాతీయ ర‌హ‌దారులు, రూ. 521 కోట్ల‌తో చేప‌ట్టే కాజిపేట రైల్వే వ్యాగ‌న్ రిపేర్ యూనిట్ కు శంకుస్థాప‌న చేస్తారు. 12.30 గంట‌ల‌కు బీజేపీ విజ‌య సంకల్ప స‌భ‌లో ప్ర‌సంగించారు. 1.45 కు రాజ‌స్థాన్ కు వెళ‌తారు.

Also Read : PM Modi : గీతా ప్రెస్ దేశ సంస్కృతికి ప్ర‌తీక – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!