PM Modi Visit : అమెరికాకు చేరుకున్న మోదీ

బైడెన్ తో స‌మావేశం కానున్న పీఎం

PM Modi Visit : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేర‌కు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ యుఎస్ కు చేరుకున్నారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమెరికాలో టూర్ ముగించుకున్న అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి నేరుగా ఈజీప్టు సంద‌ర్శ‌న‌కు వెళ‌తారు. ఇదిలా ఉండ‌గా అమెరికా, భార‌త దేశాల మ‌ధ్య గ‌త కొంత కాలం నుంచి స‌త్ సంబంధాలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు ప్ర‌పంచ ఆర్థిక రంగంలో భార‌త్ కీల‌క‌మైన భాగ‌స్వామి పాత్ర‌ను పోషిస్తోంది.

మంగ‌ళ‌వారం అమెరికాకు చేరుకున్న మోదీకి గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది. జూన్ 21న ఐక్య రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే అంత‌ర్జాతీయ యోగా సెష‌న్ కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) . ఇది అరుదైన అవ‌కాశంగా పేర్కొన్నారు మోదీ. 2014 లో ఐక్య రాజ్య స‌మితి యోగాను ప్ర‌పంచ దినోత్స‌వంగా ప్ర‌క‌టించింది. దీనికి ప్ర‌ధాని చొర‌వే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

యోగా దినోత్స‌వంలో పాల్గొన్న అనంత‌రం మోదీ జూన్ 22న వైట్ హౌస్ కు వెళతారు. అక్క‌డ అమెరికా చీఫ్ జో బైడెన్ తో ఉన్న‌త స్థాయి స‌మావేశంలో పాల్గొంటారు. యుఎస్ కాంగ్రెస్ స్టేట్ డిన్న‌ర్ లో ప్ర‌సంగిస్తారు. 23న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హారీస్ తో పాటు సెక్ర‌ట‌రీ బ్లింకెన్ తో చ‌ర్చిస్తారు మోదీ.

Also Read : Punjab CM Bhagwant Mann : పంజాబ్ సీఎం యోగాలో లీనం

 

Leave A Reply

Your Email Id will not be published!