PM Modi Visits : భద్రకాళి ఆలయంలో మోదీ
అమ్మ వారిని దర్శించుకున్న ప్రధాని
PM Modi Visits : తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓరుగల్లుకు చేరుకున్నారు(PM Modi Visits). హకీంపేటకు చేరుకున్న మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సి ఉండగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ కమ్ చెప్పారు.
అక్కడి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాన మంత్రి మామునూరుకు చేరుకున్నారు. ఇక్కడ కొలువు తీరిన భద్రకాళి ఆలయానికి వెళ్లారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజారులు. ఈ సందర్బంగా నరేంద్ర మోదీ అమ్మ వారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాల వద్దకు చేరుకున్నారు ప్రధాన మంత్రి. ఆవులకు తినిపించారు మోదీ.
ప్రధానమంత్రికి పూజారులు ఆశీర్వచనం చేశారు. అనంతరం నేరుగా ఆర్ట్స్ కళాశాల మైదానం వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రూ. 6,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారుల అభివృద్దికి, రూ. 521 కోట్లతో చేపట్టనున్న రైల్వే వ్యాగన్ యూనిట్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుసస్థాపన చేశారు.
మోదీ పర్యటనలో భాగంగా 10,000 వేల మంది పోలీసులు మోహరించారు. వరంగల్ చుట్టు పక్కల 20 కిలోమీటర్ల మేర 144వ సెక్షన్ విధించారు.
Also Read : PM Modi Visits : భద్రకాళి ఆలయంలో మోదీ
