PM Modi Wishes : మోదీ ఆషాఢ ఏకాదశి..బక్రీద్ విషెస్
హిందువులు..ముస్లింలకు గ్రీటింగ్స్
PM Modi Wishes : దేశ వ్యాప్తంగా జూన్ 29న ఆషాఢ ఏకాదశితో పాటు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ట్విట్టర్ వేదికగా హిందువులు, ముస్లిం సోదర సోదరీమణులకు విషెష్ పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా వార్కారీ సంప్రదాయానికి అనుగుణంగా భక్తి , వినయం , కరుణ వంటి సద్గుణాలను స్వీకరించేందుకు ఈ పవిత్ర దినం మనల్ని ప్రేరేపిస్తుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
భగవాన్ విఠల్ ఆశీస్సులతో, సంతోషకరమైన , శాంతి యుతమైన , సమ్మిళ సమాజాన్ని నిర్మించేందుకు మనం అంతా ఎల్లప్పుడూ కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా ప్రతి ఏటా బక్రీద్ ను నిర్వహిస్తారు. దీనిని పురస్కరించుకుని నరేంద్ర మోదీ(PM Modi) ఈద్ – ఉల్- అధా శుభాకాంక్షలు తెలిపారు. ఇవాల ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని, శ్రేయస్సును ఆ భగవంతుడు అందజేయాలని కోరారు ప్రధానమంత్రి. ఇది మన సమాజంలో ఐక్యం, సామరస్య స్పూర్తిని కూడా నింపుతుందని పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఈద్-ఉల్-అధా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలి. ఇది మన సమాజంలో ఐక్యత మరియు సామరస్య స్ఫూర్తిని కూడా నిలబెట్టాలి. ఈద్ ముబారక్!
Also Read : Allahabad HC : ఆది పురుష్ పై హైకోర్టు ఆగ్రహం