PM Narendra Modi: పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన్ సేతు’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ !

పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన్ సేతు’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ !

PM Narendra Modi: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను గుజరాత్‌ లోని ద్వారకలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్నఈ కేబుల్ బ్రిడ్జ్ కు ‘సుదర్శన్ సేతు’ అని నామకరణం చేసారు. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై…. 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ కు రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి ఫోటోలను ఏర్పాటు చేసారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓఖా ప్రాంతాన్ని… బెట్‌ ద్వారకాతో అనుసంధానించే విధంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించారు. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ కు 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు.

PM Narendra Modi Inaugurated

రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ…. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అక్కడి బెట్‌ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాదీశ్‌ ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించారు.

Also Read : Nirmala Sitharaman : కేంద్ర మంత్రి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులతో మాట మంతి

Leave A Reply

Your Email Id will not be published!