British MP PM Modi : మోడీ దమ్మున్న లీడర్ – బ్రిటన్ ఎంపీ
మోదీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదం తర్వాత
British MP PM Modi : ఓ వైపు బ్రిటన్ కు చెందిన దిగ్గజ మీడియా సంస్థ బీబీసీ ప్రధాన మంత్రి మోడీని టార్గెట్ చేస్తే అదే దేశానికి చెందిన చట్టసభ సభ్యుడు లార్డ్ కరణ్ బిలిమోరియా ప్రశంసలు కురిపించారు. చట్ట సభలో నరేంద్ర మోడీ అసాధారణ జీవితాన్ని, ఆయన నాయకత్వంలో భారత్ ఎలా ఎదుగుతుందోనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైన పదవికి చేరుకున్న తీరు గొప్పదని కొనియాడారు. అంతే కాదు మోడీ ప్రపంచంలో శక్తివంతమైన లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుతం యుకే ఎంపీ లార్డ్ కరణ్ బిలియోరియో(British MP) చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో వైరల్ గా మారింది.
వరల్డ్ లోనే ఎన్నదగిన , లెక్కించ దగిన వ్యక్తులలో, నాయకులలో ఒకరుగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ నిలిచి పోతారని స్పష్టం చేశారు లార్డ్ కరణ్ బిలిమోరియా. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన నరేంద్ర మోడీ ఇవాళ తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు.
భారత సంతతికి చెందిన యుకె ఎంపీ లార్డ్ పార్లమెంట్ చర్చ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ భారత దేశం జీ20 అధ్యక్ష పదవి కలిగి ఉంది. రాబోయే 25 సంవత్సరాలలో యుఎస్ 32 బిలియన్ల జీడీపీతో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు దూసుకు వెళుతోందని పేర్కొన్నారు ఎంపీ(British MP). మన దేశం ప్రధానమంత్రితో , భారత్ తో సత్ సంబంధాలు కలిగి ఉండాలని కోరారు ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా.
Also Read : యుఎస్ మీడియాలో ఉద్యోగాల కోత