PM Narendra Modi: బిహార్‌ ముద్దుబిడ్డ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని – మోదీ

బిహార్‌ ముద్దుబిడ్డ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని - మోదీ

Narendra Modi : ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్‌- బిస్సేర్‌తో సహా 38 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

PM Narendra Modi Praises

ఈసందర్భంగా అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశంలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రధానమంత్రి కమ్లాను బిహార్‌ కు ముద్దుబిడ్డగా మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. కమ్లా పూర్వీకులు బిహార్‌ లోని బక్సర్‌ కు చెందినవారని తెలిపారు. అక్కడి ప్రజలు ఆమెను బిహార్‌ కుమార్తెగా భావిస్తారన్నారు. ఆ రాష్ర్ట వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. శతాబ్దాలుగా వివిధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. ట్రినిడాడ్‌లోని పలు వీధులకు బనారస్‌, పట్నా, కోల్‌కతా, దిల్లీ వంటి పేర్లు ఉన్నాయన్నారు.

ఇక్కడి భారతీయుల సాకారంతో దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారన్నారు. ఇరుదేశాల మధ్య స్నేహం మరింత బలంగా పెరిగిందన్నారు. భారత్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థ అని అన్నారు. మన అభివృద్ధి ప్రపంచానికి పరస్పర ప్రయోజనం చేకురేలా ఉండాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కమ్లాకు పవిత్రమై మహాకుంభ్‌ జలంతో పాటు రామ మందిరం ప్రతిమను మోదీ బహుకరించారు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఒక చిన్న దేశం. భారత్‌లోని జోధ్‌పుర్‌ కంటే ఇది చిన్నదిగా ఉంటుంది. అయితే, ఇక్కడ భారత సంతతికి చెందిన ప్రజలు 40శాతం మంది ఉన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఇప్పటికీ వారి ఆహారం, సంగీతం, భాషల్లో స్పష్టంగా కన్పిస్తాయి.

Also Read : Shubhanshu Shukla: యూపీ, కేరళ విద్యార్థులతో ముచ్చటించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా

Leave A Reply

Your Email Id will not be published!