Narendra Modi : భారత్ లో పెట్టుబడులపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

సెమీకండక్టర్, క్వాంటం మిషన్ వంటి ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణలు...

Narendra Modi : భారతదేశంలో పెట్టుబడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన సమయమని ఆయన అన్నారు. పారిస్‌లో జరిగిన ఇండియా-ఫ్రాన్స్ CEO ఫోరమ్‌లో ప్రసంగిస్తూ, 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

Narendra Modi Comment

ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు తమ పెట్టుబడులను భారతదేశంలో పెట్టేందుకు ఇది మంచి సమయం అని ప్రధాని అన్నారు. CEO ఫోరమ్‌లో పాల్గొన్న కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు.

ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, AI, అంతరిక్ష సాంకేతికత, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం వంటి విజయాలను ప్రధాని ప్రస్తావించారు. భారతదేశం గత పదేళ్లలో అనేక మార్పులు చేశిందని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని మోదీ(Narendra Modi) చెప్పారు.

ప్రధాని మోదీ 2047 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశామని, భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు.

భారతదేశం ప్రపంచ పెట్టుబడుల ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా మారుతోందని ప్రధాని చెప్పారు. దేశం పలు ఆధునిక ప్రాజెక్టులను ప్రారంభించింది. సెమీకండక్టర్, క్వాంటం మిషన్ వంటి ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణలు.

రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నామని మోదీ తెలిపారు. భారతదేశంలో సాంకేతికత, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియా పెట్టుబడుల కోసం కీలకమైన ప్రాంతంగా ఉందని చెప్పారు.

ఇందుకోసం, విదేశీ వ్యాపారవేత్తలు భారతదేశంలో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమయ్యారని, 2025 నాటికి భారతదేశం మరింత ఉత్పత్తి, వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి సిద్ధం అవుతుందని ప్రధాని అన్నారు.

ఈ వ్యాఖ్యలు భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పవచ్చు. ఫ్రాన్స్ తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు, రేపు అమెరికాలో పర్యటించనున్నారు.

Also Read : Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీలో ఉద్యోగాలు

Leave A Reply

Your Email Id will not be published!