PM Narendra Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.0 లో మోదీ కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ....

Narendra Modi : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందన్నారు. ఆ విధంగా దేశ పురోగతికి అసోం రాష్ట్ర సహకారం క్రమక్రమంగా పెరుగుతోందని తెలిపారు. మంగళవారం రాజధాని గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Narendra Modi Key Comments

ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Narendra Modi) మాట్లాడుతూ.. తూర్పు, ఈశాన్య ప్రాంతాలు దేశం భవిష్యతులో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాయన్నారు. అందులోభాగంగా అసోం పురోగతి.. ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలుస్తోందన్నారు. ఇక 2018లో అడ్వాంటేజ్ అసోం సదస్సు నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Narendra Modi) గుర్తు చేశారు. ఆ సమయంలో ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి విలువ రూ. 2.75 లక్షల కోట్లు ఉండగా.. నేడు అది రూ. 6 లక్షల కోట్లకు చేరుకొందని ప్రధాని నరేంద్ర మోదీ గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు.

అలాగే బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ఆయన విపులీకరించారు. 2014కు ముందు అసోంలోని బ్రహ్మపుత్ర నదిపై మూడు బ్రిడ్జిలు మాత్రమే ఉండేవని. కానీ గత పదేళ్లలో ఈ నదిపై నాలుగు కొత్త బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. ఇక గత యూపీఏ హయాంలో అంటే.. 2009 నుంచి 2014ల మధ్య అసోంకు రూ. 2,100 కోట్ల మేర రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే.. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో ఆ కేటాయింపులు కాస్తా రూ.10 వేల కోట్లుకు చేరుకుందని ప్రధాని మోదీ(Narendra Modi) చెప్పారు.

ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో వివిధ మార్గాల్లో విమాన సర్వీసులు సైతం భారీగా పెరిగాయన్నారు. గతంలో యూపీఏ హయాంలో కేవలం 7 మార్గాల్లోనే విమానాలు నడిచేవని.. కానీ ప్రస్తుతం 30 మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయని ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారు. భారత్‌లో దాదాపు 50 శాతానికి పైగా సహాజ వాయువు అసోం నుంచే లభిస్తోందని గుర్తు చేశారు. దీంతో ఈ రాష్ట్రంలోని రిఫైనరీల కెపాసిటీని గణనీయంగా పెంచామన్నారు.

అలాగే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాలు దూసుకు పోతున్నాయని తెలిపారు. పశ్చిమ భారతావనిలో అసోం అతిపెద్ద తయారీ హబ్‌గా మారేందుకు మరెంతో కాలం పట్టదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం అసోంకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అసోం ఆర్థికంగా పురోగమించిందని తెలిపారు. అందుకు తేయాకు, సహజ వాయువులు, హైడ్రోకార్బన్ పుష్కలంగా ఉండేవని.. ఆ యా రంగాల నుంచి వచ్చే ఆదాయం కారణంగా.. జాతీయ ఆర్థికాభివృద్దిలో అది 4 శాతంగా ఉండేదన్నారు.

ఈ సమ్మిట్‌కు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, రిలయన్స్ సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని, వేదాంత సంస్థ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తోపాటు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్స్ సీఎండీ సజ్జన్ జిందాల్ తదితరులు హాజరయ్యారు.అలాగే పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులతోపాటు దాదాపు 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు.

Also Read : Minister Kishan Reddy :సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని నిరూపించాలి

Leave A Reply

Your Email Id will not be published!