Mallikarjun Kharge: మల్లికార్జున్‌ ఖర్గే హెలికాప్టర్‌ లో తనిఖీలు !

మల్లికార్జున్‌ ఖర్గే హెలికాప్టర్‌ లో తనిఖీలు !

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్‌ ను బిహార్‌లోని సమస్తిపూర్‌ లో పోలింగ్‌ అధికారులు శనివారం తనిఖీ చేశారు. బీహార్ లోని సమస్తీపూర్‌, ముజఫర్‌ పర్‌ లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్ లో తనిఖీలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ఎన్నికల అధికారులు టార్గెట్‌ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా వదిలేస్తున్నారని వారు ద్వజమెత్తారు.

Mallikarjun Kharge Helicopter Checking

‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను ఎ‍న్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గే(Mallikarjun Kharge)ను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాజేష్‌ రాథోడ్‌ అన్నారు. బిహార్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్‌ చెక్‌ చేశారని రాజేష్‌ రాథోడ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘కేవలం కాంగ్రెస్‌ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్‌ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్‌ రాథోడ్‌ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్‌ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read : Narendra Modi: ఈ నెల 14న ప్రధాని మోదీ నామినేషన్‌ ?

Leave A Reply

Your Email Id will not be published!