Youtuber Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై హరియాణా పోలీసుల సంచలన ప్రకటన
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై హరియాణా పోలీసుల సంచలన ప్రకటన
Jyoti Malhotra : పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాపై పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మరోవైపు హరియాణా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే జ్యోతి మల్హోత్రాపై హరియాణా పోలీసులు సంచలన ప్రకటన చేసారు. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హరియాణా పోలీసులు స్పష్టం చేసారు. అయితే, ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేగాక, సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు.
Haryana Police Shocking Comments on Youtuber Jyoti Malhotra
ఈ సందర్భంగా హిస్సార్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను మేం గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవు. ఇక, పాక్(Pakistan) ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గానీ నిర్ధరించే పత్రాలేవీ మాకు దొరకలేదు. అయితే, ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ… జ్యోతి(Jyoti Malhotra) వారితో సంప్రదింపులు కొనసాగించారు. ఇక, మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అన్పించడం లేదు’’ అని హిస్సార్ ఎస్పీ పేర్కొన్నారు.
అదేసమయంలో జ్యోతి(Jyoti Malhotra) డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై కూా ఎస్పీ స్పందించారు. ‘‘పాక్ గూఢచర్యులతో సంబంధాలకు సంబంధించిన కేసులో ఆమెను రిమాండ్ లోకి తీసుకున్నాం. ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయి. అయితే, ఏ ఇతర కస్టడీకి జ్యోతిని అప్పగించలేదు. మరోవైపు, ఆమె డైరీలోని కొన్ని పేజీలంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాంటివేవీ మేం స్వాధీనం చేసుకోలేదు. మా దగ్గర ఎలాంంటి డైరీ లేదు. ఆమెకు చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. వాటిని పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించాం’’ అని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్‌తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ జ్యోతి.. డానిష్‌తో మాట్లాడినట్లు సమాచారం. దీనితో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నించారు.
Also Read : PM Narendra Modi: ప్రధాని మోదీకి ముస్లిం కళాకారుల స్పెషల్ గిఫ్ట్