Police Case Bandi Sanjay : బండి సంజయ్ పై కుట్ర కేసు
పేపర్ లీకేజీ కేసులో కొత్త కోణం
Police Case Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Police Case Bandi Sanjay) అరెస్ట్ పై పోలీసులు స్పందించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఎంపీపై కుట్ర కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై కుట్ర పన్నారంటూ కేసు నమోదు చేశారు. సెక్షన్ 5 కింద బీజేపీ స్టేట్ చీఫ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎంపీ బండి సంజయ్ పై వరంగల్ లో కేసు నమోదు కావడం విశేషం. మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉన్న సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్ ను బలవంత్ంగా పోలీసులు లాక్కెళ్లారు. అక్కడి నుంచి హైడ్రామా మధ్య బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడి నుంచి వరంగల్ కు మారుస్తున్నట్లు మొదట వెల్లడించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆలేరుకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా(Bandi Sanjay) ఉన్నారు. అంతే కాదు ఆ పార్టీకి చెందిన ఎంపీ కూడా. ఒకవేళ ఎన్ని కుట్రలు పన్నినా ఎంపీని అరెస్ట్ చేయాలంటే ముందు లోక్ సభ ఎంపీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించ లేదని ఆరోపించారు బీజేపీ నాయకులు. రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా బండి సంజయ్ ని కోర్టు ముందు హాజరు పర్చలేదు. దీనిపై ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది.
Also Read : స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరం – సీజేఐ