Police: దొంగకు చెప్పులదండ వేసి ఊరేగించిన పోలీసులు

దొంగకు చెప్పులదండ వేసి ఊరేగించిన పోలీసులు

Police : జమ్ముకశ్మీర్ పోలీసులు విచిత్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆసుపత్రిలో రోగి నుండి డబ్బులు దొంగతనం చేసిన దొరికిన ఒక దొంగను పట్టుకుని దేహశుద్ది చేసారు. ఆపై పోలీసు వాహనం బానెట్‌పై కూర్చోబెట్టి, అతడి చేతులు కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనితో ఉన్నతాధికారులు ఆ పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. ప్రజల సమక్షంలో పోలీసులు ఓ వ్యక్తిని అవమానించడం చట్ట ఉల్లంఘనే అంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అమానవీయ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు జమ్మూ (Jammu) పోలీసు సీనియర్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు.

Police Punishment

అయితే నిందితుడు ఇటీవలే పట్టుబడిన ఓ పేరుమోసిన దొంగల ముఠాలో సభ్యుడని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల కిత్రం ఓ రోగి కోసం మందులు కొంటున్న వ్యక్తి నుంచి నిందితుడు రూ.40 వేలు తస్కరించి పరారయ్యాడు. తాజాగా నిందితుడిని ఓ ఆసుపత్రి పరిసరాల్లో చూసిన బాధితుడు అతడిని వెంబడించాడు. ఈ క్రమంలోనే నిందితుడు ఆ వ్యక్తిపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రాంతంలో గస్తీకాస్తున్న పోలీసులు అతడిని పట్టుకుని, చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము వెంటనే విచారణకు ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిని అర్థనగ్నంగా చేసి, చేతులకు సంకెళ్లు వేసి, చెప్పుల దండతో పోలీసు జీపు బోనెట్‌పై కూర్చోబెట్టి జమ్మూ నగర వీధుల్లో తిప్పుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. బక్షి నగర్ ప్రాంతంలో ఆ వ్యక్తి ఔషధం కొనుగోలు చేస్తూ, రూ. 40 వేలు చోరీ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమయ్యింది.

Also Read : PM Narendra Modi: ప్రధాని మోదీ ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’

Leave A Reply

Your Email Id will not be published!