Police: బైక్‌పై రొమాన్స్‌ కు 53వేలు, ‘స్పైడర్‌మ్యాన్’కు 15 వేలు ఫైన్ వేసిన పోలీసులు

బైక్‌పై రొమాన్స్‌ కు 53వేలు, 'స్పైడర్‌మ్యాన్'కు 15 వేలు ఫైన్ వేసిన పోలీసులు

Police : ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని పోలీసులు (Police) సూచిస్తున్నప్పటికీ కొందరు మాత్రం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతుండటం తరచూ చూస్తున్నాం. ఈ క్రమంలో నొయిడాకు చెందిన ఓ జంట కూడా బైక్‌పై ఆలింగనం చేసుకొని ప్రమాదకర రీతిలో ప్రయాణించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రోమియో-జూలియట్‌’ చేష్టలను తీవ్రంగా పరిగణించిన యూపీ పోలీసులు… వారికి రూ.53వేల భారీ జరిమానా విధిస్తూ షాక్‌ ఇచ్చారు.

నొయిడాకు చెందిన ఓ జంట ఇటీవల హెల్మెట్‌ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బైక్‌పై దూసుకెళ్లారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎదురెదురుగా కూర్చొని కనిపించారు. వెనక ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన యూపీ పోలీసులు (Police).. ‘లవ్‌ సాంగ్‌ కాదు.. ఈసారి భారీ చలానాతో ముగించాం. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి.. మీ ప్రేమకథను చిరకాలం కొనసాగించండి’ అంటూ పోస్టు పెట్టారు. దీనిపై యూజర్లు స్పందిస్తూ.. ఆ జరిమానా ఎవరు చెల్లిస్తారు..? రోమియోనా, జూలియట్‌ లేదా వారి తల్లిదండ్రులా? అంటూ హాస్యంగా ప్రశ్నించారు.

Police – ‘స్పైడర్‌మ్యాన్’కు పోలీసుల షాక్‌ !

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వడానికి యువత… అతిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశాలో ‘స్పైడర్‌మ్యాన్’ వేషధారణలో బైక్‌పై స్టంట్లు చేసిన ఓ యువకుడికి పోలీసులు (Police) షాక్‌ ఇచ్చారు. అతనికి రూ. 15,000 జరిమానా విధించారు. ఒడిశాలోని రౌర్కెలాలో ఈ ఘటన జరిగింది. “స్పైడర్‌మ్యాన్” డ్రెస్‌ లో అధిక వేగంతో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపించాడు. కనీసం హల్మెట్‌ కూడా లేకుండా నేనే స్పైడర్‌మ్యాన్ అంటూ స్టంట్లు చేస్తూ… వాహనదారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగించాడు.

పెద్దగా శబ్ధం చేసే విధంగా మోడిఫైడ్‌ లౌడ్ సైలెన్సర్‌తో హల్‌చల్‌ చేశాడు. ఆ యువకుడి ఓవర్‌యాక్షన్‌కు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్‌లు వేశారు. అతని బైక్‌ను స్వాధీనం చేసుకుని రూ. 15,000 జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, వేగం, మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్‌ వాడినందుకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్‌, స్పైడర్‌ ఉమెన్‌ దుస్తులు ధరించిన ఓ జంట బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఢిల్లీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు 20 ఏళ్ల ఆదిత్య మరియు 19 ఏళ్ల అంజలి అని తెలుస్తోంది. ఢిల్లీలోనే జరిగిన మరో ఘటనలో స్పైడర్‌మ్యాన్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చొని విన్యాసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిని నజాఫ్‌గఢ్ నివాసి ఆదిత్య (20) గా గుర్తించారు. మరో వైపు, వాహనం నడుపుతున్న వ్యక్తిని మహావీర్ ఎన్‌క్లేవ్ నివాసి గౌరవ్ సింగ్‌కు కూడా పోలీసులు జరిమానా విధించారు.

Also Read : CM Rekha Gupta: దిల్లీ సీఎంపై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Leave A Reply

Your Email Id will not be published!