Ponguleti Srinivas Reddy : ఆరు గ్యారెంటీల అమలు పక్కా
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : హైదరాబాద్ – ఆరు నూరైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రాష్ట్రంలో తాము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చేయగలిగినవే చెప్పామన్నారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అంత దాకా ప్రతిపక్షాలు ఓపిక పట్టాలన్నారు.
Ponguleti Srinivas Reddy Comment about Six Guarantees
ధరణిలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నేతలపై కావాలని అరెస్ట్ లు ఉండబోవని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి భంగం కలిగించేలా చేసిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిని, సొమ్ములను కాజేసిన వారిని తప్పకుండా గుర్తించి చర్యలు తీసుకుంటామని కుండ బద్దలు కొట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారని తెలిపారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మరిచి పోయి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. తమ సీఎం పూర్తిగా సమాధానం ఇచ్చారని తెలిపారు. తాము చిత్తశుద్దితో పని చేస్తామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : Rohit Sharma : కెప్టెన్సీ తొలగింపు బాధాకరం