Ponguleti Srinivas Reddy : ఐటీ దాడులకు భయపడను
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : ఖమ్మం – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో తాను నామినేషన్ వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivas Reddy Comment
తన ఆస్తులు, ఆఫీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందంటూ ఆనుమానం వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో మోదీ సాయంతో దాడులు, సోదాలు చేపట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు, దాడులు మొదలయ్యాయి. దీంతో ఖమ్మం నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐటీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పొంగులేటి(Ponguleti Srinivas Reddy) నివాసం వద్దకు చేరుకున్నారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, దీనిని తట్టుకోలేకే తనపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయినా తాను భయపడే ప్రసక్తి లేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : Revanth Reddy : ఐటీ దాడులు దేనికి సంకేతం