Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ లో నరకం చూశా
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఈనాటి వరకు నిత్యం నరకం చూశానని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో తాను బీఆర్ఎస్ ను ఓడించడమే తాను లక్ష్యంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
నిజాం నవాబు లాగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దించే పార్టీలోనే తాను చేరుతానని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీని కూడా గెలవనీయమని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే పార్టీ కోసం పని చేసిన తనను , మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావును సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తాను పని చేస్తానని, ఏ పార్టీలో చేరమంటే తాను ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ లో చేరక ముందు నుంచే తాను కాంట్రాక్టర్ గా ఉన్నానని చెప్పారు. వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిప్పటి నుంచి నేటి దాకా సుఖం లేకుండా పోయిందన్నారు.
Also Read : మేడ్చల్ నుంచి పోటీ చేస్తా – మల్లన్న