Ponguleti Srinivas Reddy : తెలంగాణ పేరుతో నిలువు దోపిడీ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్
Ponguleti Srinivas Reddy : పాలేరు – నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబానికి మేలు చేకూరిందన్నారు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Ponguleti Srinivas Reddy Serious Comments on KCR
కాళేశ్వరం పేరుతో ఐదున్నర లక్షల కోట్ల ప్రజల సొమ్ము సీఎం కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు . ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మన కష్టాలు తీరుతాయని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). సంక్షేమ పథకాల పేరుతో లూటీ చేశాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కాలకేయులుగా మారారంటూ మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, పదవులు కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు మారాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.
ఉద్యోగాలు రాక పోవడంతో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దీనికి బాధ్యత వహించాల్సింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. తమ సర్కార్ వచ్చాక కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేస్తామని హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : ACA Offer : ఇండియా..కీవీస్ మ్యాచ్ ఫ్రీ