Minister Ponnam Prabhakar : రేపు భారత్ సమ్మిట్ కు హాజరు కానున్న రాహుల్ గాంధీ

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి డిక్లరేషన్‌ చేయనున్నారు...

Ponnam Prabhakar : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపటి (శనివారం) భారత్ సమ్మిట్‌కు హాజరవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రపంచానికి హైదరాబాద్‌ ఖ్యాతీని చాటి చెప్పేలా భారత్ సదస్సు -2025ను నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ(శుక్రవారం), రేపు (శనివారం) ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో(హెచ్ఐసీసీ)లోని నోవాటెల్‌లో ఈ సదస్సు జరుగుతుందని అన్నారు. హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సదస్సుకు 98 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక న్యాయం అనే అంశంపై ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి డిక్లరేషన్‌ చేయనున్నారు. భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Minister Ponnam Prabhakar Comments

మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ… పెట్టుబడులకు, ఇండస్ట్రీయల్ రంగానికి హైదరాబాద్ ఎలా ఉపయోగపడుతుందో భారత్ సదస్సు డిక్లరేషన్‌లో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ డిక్లరేషన్ చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ గురించి డిక్లరేషన్ చేస్తారని అన్నారు. హైదరాబాద్ చరిత్ర, భవిష్యత్తును డిక్లరేషన్‌లో పొందుపరిచామని వెల్లడించారు.హైదరాబాద్‌లో ఉన్న శాంతిని ప్రపంచం మార్గదర్శకంగా తీసుకోవాలని చెబుతామని అన్నారు. సాయంత్రం క్యాండిల్ ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం గెలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఫలితాలపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా పోటీ చేసి బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని అన్నారు. తమ ప్రభుత్వానికి ఎంఐఎం సహాకరించిందని.. అందుకే వారికి మద్దతు ఇచ్చామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Also Read : Pahalgam Terror Attack : బందిపూర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ హతం

Leave A Reply

Your Email Id will not be published!