Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్ నాలుగు కేసుల్లోనూ బెయిల్ మంజూరు
పోసానికి బిగ్ రిలీఫ్ నాలుగు కేసుల్లోనూ బెయిల్ మంజూరు
Posani Krishna Murali : వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. దీనితో పోసానిపై పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. మంగళవారం ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, సోమవారం నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) బుధవారం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.
Posani Krishna Murali Got Relief
గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ చేసారు. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్‌లో పోలీస్ స్టేషన్ లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఎన్‌ఎస్ 353(1),353(2),353(సి)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని.. ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు.
Also Read : Hayagreeva Lands: నిషేధిత జాబితాలో ‘హయగ్రీవ’ భూములు ! ఉత్తర్వులు జారీ చేసిన విశాఖ కలెక్టర్ !