Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావు పేట కోర్టు

పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావు పేట కోర్టు

Posani Krishna Murali : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి స్వల్ప ఊరట లభించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి(Posani Krishna Murali) బెయిల్ మంజూరు అయ్యింది. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పోసానిని న్యాయమూర్తి ఆదేశించారు. మార్చి మొదటి వారంలో పోసానిపై నమోదైన కేసులో పోలీసులు పిటి వారెంట్‌ పై నరసరావుపేట కోర్టులో పోసాని హాజరు పరిచారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు పోసాని(Posani Krishna Murali)కి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీనితో ఆయన్ను నరసరావుపేట టూటౌన్‌ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.

Posani Krishna Murali Bail Granted…

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో పలుచోట్ల అతనిపై జనసేన నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు చేసారు. వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు గానూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా మెుత్తం 16 కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో పోసానిని ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లె కు తరలించారు. అనంతరం అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ తరువాత పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్‌ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది. ప్రస్తుతం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు.

Also Read : Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

Leave A Reply

Your Email Id will not be published!