Posani Krishna Murali: జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి

జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali : చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) ఎట్టకేలకు విడుదలయ్యారు. గత కొన్ని రోజుల నుంచి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని… శుక్రవారం ఆయనకు గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. వైసీపీ నేత అంబటి రాంబాబు… జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత పోసాని తన కుటుంబసభ్యులతో కలిసి కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు.

Posani Krishna Murali – షరతులతో కూడిన బెయిల్

గుంటూరులోని సీఐడీ కోర్టు పోసానికి షరతులతో కూడిన బెయిల్‌(Bail) మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులతోపాటు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీటు దాఖలు చేసే వరకు గుంటూరు సీఐడీ రీజినల్‌ ఆఫీసులో రెండు వారాలకోసారి హాజరు కావాలని షరతు పెట్టింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే, పోసానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు అయి ఉన్నాయి. బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొని ఉండింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినా… ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా ? అన్న అనుమానం కూడా ఉండింది. కానీ, ఆ ఉత్కంఠకు తెరపడి, పోసాని విడుదలయ్యారు.

పోసాని క‌ృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చిత్ర పరిశ్రమపై అసభ్యకరమైన కామెంట్లు చేశాడంటూ ఆయనపై స్థానికులు కేసు పెట్టారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 22 వరకు ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Also Read : Road Accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని రాచకొండ అడిషినల్ ఏఎస్పీ మృతి

Leave A Reply

Your Email Id will not be published!